కృష్ణాష్టమి స్పెషల్ : అటుకుల లడ్డూ చేసేద్దాం!

శనివారం, 16 ఆగస్టు 2014 (13:45 IST)
కృష్ణాష్టమిని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. చిన్ని కృష్ణున్ని తమ ఇళ్లకు ఆహ్వానిస్తూ పడతులు కృష్ణ పాదాలు వేస్తారు. బాలకృష్ణుడు తమ ఇంట అడుగుపెడితే సకలశుభాలు కలుగుతాయని భావిస్తారు. 
 
శ్రీ కృష్ణుడికి అటుకులంటే ఎంతో ఇష్టమని అందరికీ తెలిసిందే. అందుచేత కృష్ణుడి పుట్టినరోజున.. చిట్టి పాదాలతో నడిచి వచ్చే ఆ స్వామికి ఇష్టమైన అటుకులతో ఈ తీపి వంటకం సమర్పిద్దాం... 
 
అటుకుల లడ్డూ ఎలా చేయాలి?
అటుకులు: రెండు కప్పులు
నెయ్యి: నాలుగు టేబుల్ స్పూన్లు 
జీడిపప్పు: 15
కిస్ మిస్: పావు కప్పు
బెల్లం తురుము: ఒక కప్పు 
కొబ్బరి తురుము: ఒక కప్పు 
యాలకులపొడి: రెండు టీ స్పూన్లు 
 
తయారీ విధానం : ముందుగా స్టౌ మీద మందపాటి పాన్ పెట్టి అందులో అటుకుల్ని లేతగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి. తర్వాత వేయించిన అటుకులను, కొబ్బరి తురుము, యాలకులు, జీడిపప్పును మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇందులో బెల్లం తురుము కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకూ గ్రైడ్ చేసుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోని తీసుకొని నెయ్యి, కిస్ మిస్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా చేతిలోనికి తీసుకొని లడ్డులా వత్తుకోవాలి. అంతే కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల లడ్డు రెడీ.

అన్నీ చూడండి

కొండెక్కిన గుడ్డు... తెలంగాణాలో అమాంతం పెరిగిపోయింది...

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చి వైద్యులపై దాడి చేసిన మహిళ

శ్రీవారి సేవలో అనంత్ అంబానీ... శ్రీనివాసుడికి భారీ విరాళం

నెల్లూరులో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల గల్లంతు

అన్నీ చూడండి

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ కొత్త సినిమాకు విజయం టైటిల్ ఖరారు

Show comments