దీపావళి స్పెషల్: మోతిచర్ లడ్డూను ఎలా చేయాలి?

మంగళవారం, 10 నవంబరు 2015 (17:25 IST)
దీపావళి నోరూరించే లడ్డూలను ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇంట్లోనే తక్కువ సమయంలో ఈ లడ్డూలను చేసేయొచ్చు. అయితే ఎప్పుడూ బూందీ లడ్డూతో బోర్ కొట్టేసిందా.. అయితే నార్తిండియన్ స్టైల్‌లో మోతిచర్ లడ్డూ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
శెనగ పిండి - 3 కప్పులు 
పిస్తా, బాదాం పప్పులు - అర కప్పు 
పాలు - ఒకటిన్నర లీటరు 
యాలకుల పొడి - రెండు టీ స్పూన్లు 
నెయ్యి - రెండు కప్పులు
పంచదార - మూడు కప్పులు 
 
తయారీ విధానం : 
ముందుగా వెడల్పాటి బాణలి పంచదారకు తగినన్ని నీటిని చేర్చి పాకం పట్టాలి. ఈ పాకంలో పాలను కలిపి పొంగి వచ్చిన తర్వాత యాలకుల పొడిని చేర్చాలి. పాకాన్ని స్టౌ మీద నుంచి దించేసి.. సిద్ధంగా ఉంచిన శెనగపిండిలో, పాలను కలిపి బూందీకి తగ్గట్లు కలుపుకోవాలి.

పాన్‌లో నెయ్యిని పోసి వేడయ్యాక.. జారుగా కలిపివుంచిన శెనగపిండి మిశ్రమాన్ని బూందీ రూపంలో జారనివ్వండి. బూందీలను బంగారం రంగు వచ్చేంతవరకు వేయించి మరో ప్లేటులోకి తీసుకోవాలి. ఈ బూందీలను సిద్ధంగా ఉంచుకున్న పాకంలో కలుపుకుని ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడినీటిని కలిపి లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే మోతిచర్ లడ్డూ రెడీ అయినట్లే.

అన్నీ చూడండి

నీట్ యూజీ రీ టెస్ట్ : అభ్యర్థుల కోసం ఎన్.టి.ఏ వాట్సాప్

దేశంలో టెలిగ్రామ్ సేవలు బంద్ - తాత్కాలిక నిషేధం సబబే.. ఢిల్లీ హైకోర్టు

శుభవార్త : తెలంగాణాలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు

ఔటర్ రింగ్ రోడ్డుపై లగ్జరీ కారు నడిపిన 11 యేళ్ల బుడతడు... తండ్రి అరెస్టు.. కారు సీజ్

నా చావుకు ఇన్‌స్పెక్టర్ సీఐ నాగరాజే కారణం : రౌడీషీటర్ సెల్ఫీ వీడియో

అన్నీ చూడండి

ధనుష్ హీరోగా 'ఓం' - హీరోయిన్లుగా సాయిపల్లవి - శ్రీలీల

Alia Bhatt : ఆలియా భ‌ట్‌కు అండ‌గా శ‌ర్వారి పాత్రతో ఆల్ఫా ట్రైల‌ర్‌

Raashi Singh: సినిమాలు, వ్యాపారాలే కాకుండా ఇంకా చాలా చేయాల్సి ఉంది : రాశీ సింగ్

Samantha diet: నేను పెద్దగా తినలేను అందుకే బరువు తగ్గాను : సమంత ప్రభు

విజయ్‌ విజయం.. అకస్మాత్తుగా రాలేదు : సమంత

Show comments