బ్రెడ్‌తో హల్వా

Written By Ganesh
Updated: గురువారం, 8 జనవరి 2009 (18:34 IST)
FileND
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ ప్యాకెట్... ఒకటి
పంచదార... ఒక గ్లాసు
నెయ్యి.. 50 గ్రాములు
యాలకుల పొడి... చిటికెడు
జీడిపప్పు పొడి... రెండు చెంచాలు

తయారీ విధానం :
ముందుగా బ్రెడ్‌కు చుట్టూగల భాగాన్ని తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో నెయ్యి వేసి కాసేపు కాగిన తర్వాత, బ్రెడ్ ముక్కలు వేసి దోరగా వేయించి, తీసి పక్కన ఉంచుకోవాలి.

మరో పాత్ర తీసుకుని అందులో పంచదార పోసి కొంచెం నీరు జతచేసి ఉడికించాలి. పంచదార కరిగి మరుగుతూ లేతపాకం వచ్చాక వేగిన బ్రెడ్ ముక్కలు, జీడిపప్పు పొడి, యాలకుల పొడి, మరికాస్త నెయ్యి వేసి బాగా కలిపి రెండు నిముషాలు ఉడికించి దించేయాలి. అంతే బ్రెడ్ హల్వా రెడీ అయినట్లే...!

ఈ బ్రెడ్ హల్వాను గోరువెచ్చగా ఉన్నప్పుడు కప్‌లలోకి తీసుకుని సర్వ్ చేయాలి. ఇష్టమైతే అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచుకుని తర్వాత కూడా సర్వ్ చేయొచ్చు.
About Author
Ganesh
contractDetail: Webdunia Chennai.... Read More

అన్నీ చూడండి

విద్యార్థులపై పల్లెట్ గన్‌లు ప్రయోగించలేదా.. ఇదిగో రుజువు.. కళ్లుపెట్టుకుని చూడండి : రాహుల్

కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

ప్రసూతి సెలవుల తర్వాత విధులకు న్యూస్ రీడర్.. ఆ బాబుకు మధురమైన క్షణం.. ఎలా? (video)

రాజ్యమా ఉలికిపడు... ప్రధాని మోడీకి కేటీఆర్ హెచ్చరిక

పుట్టినరోజే మరణించాడు.. ఆస్పత్రిలో కేక్ కట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే?

అన్నీ చూడండి

బోరున విలపించిన కోలీవుడ్ నటి : ఎందుకో తెలుసా?

Manchu Lakshmi: సంప్రదాయ బోధనే చిన్నారుల ఎదుగులకు పునాది :మంచు లక్ష్మి

అందుకే బెనాక గోల్డ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వున్నా : నాగబాబు

పెయిడ్ ప్రీమియర్స్ తో 3.13 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన చెన్నై లవ్ స్టోరీ

వంద దేవుళ్ళు మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన జీతెలుగు

Show comments