సొరకాయ హల్వా

గురువారం, 8 జనవరి 2009 (18:44 IST)
FileFILE
కావలసిన పదార్ధాలు:
చిన్న సొరకాయ... ఒకటి
పాలు... ఒక లీటర్
జీడిపప్పు... 20గ్రాములు
యాలకులు... పది
కిస్‌మిస్... కొద్దిగా
పంచదార...300 గ్రాములు

తయారీ విధానం:
సొరకాయ చెక్కుతీసి ముక్కలుగా చేసి కొబ్బరికోరినట్లుగా సన్నగా కోరుకోవాలి. ఈ కోరును ముద్దగా చేసి నీళ్ళన్నింటినీ పిండి పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నెను పొయ్యిమీద పెట్టి వేడయ్యాక నెయ్యి పోసి, కాగిన తరువాత జీడిపప్పు, కిస్‌మిస్ వేసి దోరగా వేయించాలి.

తరువాత అదే గిన్నెలో, మిగిలిన నెయ్యిలో కోరిన సొరకాయను వేసి 10 నిమిషాలు వేయించాలి. ఆపై అందులోనే పాలు, పంచదార వేయాలి. అది బాగా దగ్గర పడి హల్వాలా అయ్యేదాకా గరిటతో కలుపుతూ ఉండాలి. తరువాత హల్వాను దించుకునేముందు వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్, యాలకుల పొడి కలపాలి. అంతే సొరకాయ హల్వా రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా.

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ కార్యకలాపాల విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లో రుణ వితరణ: రూ.393.17 కోట్ల రుణాలను మంజూరు చేసిన కెనరా బ్యాంక్, రూ. 36.85 లక్షల సీఎస్ఆర్ సాయం

వందేమాతరాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలుశిక్ష : కేంద్రం

నెలకు ఇంటి అద్దె రూ.80 వేలు.. అయినా క్యాబ్ డ్రైవర్

నిలకడగా వాంగ్‌చుక్ ఆరోగ్యం... కాక్రోచ్ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ పిలుపు

అన్నీ చూడండి

'రామాయణం' చిత్రం కాదు.. భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రయాణం : రకుల్ ప్రీత్ సింగ్

అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

Show comments