ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Modified: శుక్రవారం, 23 నవంబరు 2018 (21:16 IST)

మిక్సీలతో ఓట్లు రాలవు... మేమొస్తే డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తాం.. దానం...

ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇంటింటికి టిఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. స్థానిక కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యాన జరిగిన  ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్ధి దానం నాగేందర్ పాల్గొన్నారు. ఎన్ బిటీ నగర్లో వెయ్యి మంది కార్యకర్తలతో పెద్దఎత్తున పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు, నగర అభివృద్ధి పనులు చూసి ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని దానం నాగేందర్  అన్నారు.
 
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఈసారి టిఆర్ఎస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం మిక్సీలు పంచితే ఓట్లు ప్రజలు వేయరని స్థానిక బిజెపి నేతలను ఎద్దేవా చేశారు. తాను అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని, ఎవరికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉండి చూసుకుంటానని దానం నాగేందర్ హామీ ఇచ్చారు.