ఆ నాలుగు నియోజకవర్గాల్లో ఎవరు గెలిచినా తొలిసారే...

Written By వరుణ్
Updated: శనివారం, 25 నవంబరు 2023 (09:38 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, నాంపల్లి, చార్మినార్, బహదూర్పురా, కంటోన్మెంట్ స్థానాల్లో కొత్త అభ్యర్థులు పోటీ  చేస్తున్నారు. ఈ నాలుగు చోట్ల ఎవరు గెలిచినా కొత్త ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్టు అవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోని ఈ నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులు తొలిసారి గెలుపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. 
 
ఈ నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థుల మధ్యే పోరు జరుగుతోంది. అంటే అక్కడ ఎవరు గెలిచినా తొలిసారి ఎమ్మెల్యే అవుతారు. నాలుగు నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీల నుంచి కొత్త వారే పోటీలో ఉన్నారు. మిగతా 11 నియో జకవర్గాల్లోనూ కొత్త అభ్యర్థులు ఎంపి కయ్యే అవకాశమున్నా అక్కడ గతంలో, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వారు బరిలో ఉన్నారు.
 
ముఖ్యంగా కంటోన్మెంట్, చార్మినార్, బహదూర్ పురా, నాంపల్లి నియోజకవర్గాల ఓటర్లకు కొత్త ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించనున్నారు. కంటోన్మెంట్ కంటోన్మెంట్ నుంచి 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారిలో బీఆర్ఎస్ నుంచి లాస్య నందిత, బీజేపీ నుంచి శ్రీగణేష్, కాంగ్రెస్ నుంచి వెన్నెల గద్దర్ ఉన్నారు. వీరి మధ్యే పోటీ నెలకొంది.
 
బహదూర్‌పురా : నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎంఐఎం నుంచి మహమ్మద్. ముబీన్, బీజేపీ నుంచి వై.నరేశ్, బీఆర్ఎస్ నుంచి మీర్ ఇనాయత్ అలీ బాక్రీ, కాంగ్రెస్ నుంచి రాజేశ్కుమార్ పులిపాటి పోటీ చేస్తున్నారు.
 
చార్మినార్ : నియోజకవర్గంలో మొత్తం 14 మంది పోటీ చేస్తుండగా ఎంఐఎం నుంచి మీర్ జుల్ఫీకర్ అలీ, బీజేపీ నుంచి మేఘారాణి అగర్వాల్, కాంగ్రెస్ నుంచి మహమ్మద్ ముజీబుల్లా షరీఫ్, బీఆర్ఎస్ నుంచి సలావు ద్దీన్ లోఢీలు పోటీ చేస్తున్నారు. 
 
నాంపల్లి : ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 34 మంది పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఆనంద్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నుంచి మహమ్మద్ ఫిరోజ్ ఖాన్, బీజేపీ నుంచి జేఎల్ రాహుల్ చంద్ర, ఎంఐఎం నుంచి మహమ్మద్ మాజిద్ హుస్సేన్ పోటీలో ఉన్నారు.
 

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments