ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2024 (22:20 IST)

చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ప్రేమజంట.. హైస్పీడ్‌తో వచ్చి లాక్కెళ్తారు..?

Chain Snatching
Chain Snatching
నల్గొండ జిల్లాలో ప్రేమికులు దొంగలుగా మారారు. చైన్ స్నాచర్స్‌గా మారారు. దేవరకొండ మండలం మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ పై వచ్చి ఓ మహిళ మెడలోంచి లవర్స్ చైన్ స్నాచింగ్‌కు ‌పాల్పడ్డారు. స్థానికులు వెంబడించినా, హై స్పీడుతో లవర్స్ పారిపోయారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దేవరకొండ డీసీపీ దర్యాప్తు చేస్తున్నారు. మర్రిగూడ మండల యారగండ్ల పల్లి గ్రామానికి చెందిన సాతూ సునీత మెడలో నాలుగు తులాల చైన్ లాక్కొని పారిపోయారని పోలీసుల విచారణలో తేలింది.
 
స్కూటీపై వచ్చిన ఈ జంట ఒంటరిగా వెళుతున్న మహిళల మెడల్లో నుంచి చైన్ ను లాగేసుకుటున్నారు. యవకుడు స్కూటీ నడుపుతుండగా, యువతి మాత్రం మహిళ మెడల్లో నుంచి చైన్‌లను తెంపుకుని పారిపోతున్నారు. ఈ జంట కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.