Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఎమ్మెల్సీ ఎన్నికలు.. నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు.. కూటమికే ఐదు స్థానాలు

Written By సెల్వి
Updated: బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (11:38 IST)
Vote
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. మార్చి-3న నోటిఫికేషన్ రిలీజ్ చేసి 20వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో వున్న సంఖ్య పరంగా చూస్తే ఈ ఐదు స్థానాలు కూటమి సర్కారుకే దక్కే అవకాశాలు వున్నాయి. 
 
మొత్తం ఐదు స్థానాల్లో జనసేన, బీజేపీలకు చెరోకటి వెళ్తాయి. మిగిలిన మూడు స్థానాలు టీడీపీ నేతలకు దక్కనున్నాయి. జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఖరారు కానుంది. 
 
లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ సీటు త్యాగం చేసిన నాగబాబును రాజ్యసభకు పంపాలని కూటమి సర్కార్ ప్లాన్ చేసింది.  కానీ ఆయన రాష్ట్ర క్యాబినెట్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తపరిచడంతో నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకోవాలని కూటమి సర్కార్ భావిస్తోంది. 
 
ఇక బీజేపీ నుంచి పివిఎన్ మాధవ్‌కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఈయన 2017లో ఏపీ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023లో శాసనమండలికి జరిగిన ఉత్తరాంధ్ర పట్టభధ్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments