గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2024 (12:30 IST)

భూవివాదం.. అన్నదమ్ముల పిల్లలు గొడ్డలితో నరుక్కున్నారు.. (Video)

axe attack
ఒక భూవివాదంలో అన్నదమ్ముల పిల్లలు గొడ్డలితో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న తిప్పర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి సీరియస్‌గా ఉంది. 
 
గజ్జి లింగయ్య కుటుంబ సభ్యులు తమపై దాడి చేశారని గజ్జి చంద్రయ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని, ఆ తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.