ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2024 (10:01 IST)

తెలంగాణ రైతులకు శుభవార్త... 15 నుంచి మూడో విడత రుణమాఫీ...

Revanth Reddy
తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 15వ తేదీ నుంచి మూడో విడిత రుణమాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో రైతులకి ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పటికే తొలి దఫాలో రూ.లక్ష, రెండో దఫాలో రూ.1.50 లక్షల వరకు ఉన్న రుణాలను మాపీ చేసింది. గురువారం రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు సిద్ధమైంది. ఖమ్మం జిల్లాలోని వైరాలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీని ప్రారంభిస్తారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయి. 
 
అంతకుముందు ఆయన గోల్కొండ కోటలో జరిగే 78వ భారత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత హెలికాఫ్టరులో వైరాకు చేరుకుంటారు. అక్కడ ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించిన సీతారమ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో రైతు రుణమాఫీని ప్రకటిస్తారు. 
 
ఈ విడతలో రూ.1.5 లక్షల మంది రైతులకు రూ.2 లక్షలు చొప్పున రుణమాఫీ చేస్తారు. జూలై 18వ తేదీన మొదటి దలో భాగంగా రూ.లక్ష లోపు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. అదే నెల 30వ తేదీన రూ.లక్షన్నర రుణాలను మాఫీ చేసింది. ఇలా 12 రోజుల వ్యవధిలో మొత్తం 17.55 లక్షల మంది రైతులకు రూ.12 వేల కోట్లకు పైగా రుణాలను మాఫీ చేయడం తెలంగాణ చరిత్రలోనే ఇది మొదటిసారని ప్రభుత్వం పేర్కొందిి. ఇపుడు తుది విడతలో 14.45 లక్షల మంది రైతులకు రుణమాఫీ ద్వారా లబ్ది చేకూరనుంది.