బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2024 (10:26 IST)

బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు ప్రారంభం.. హై-స్పీడ్ ఇంటర్నెట్

bsnl
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 5జీ సేవలను ప్రారంభించనుంది. 5జీ నెట్‌వర్క్ ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్, మెరుగైన కాలింగ్ ఫీచర్లను అందించాలని బీఎస్‌ఎన్‌ఎల్ యోచిస్తోంది. బీఎస్ఎన్ఎల్ 5జీని ఉపయోగించి ఇప్పటికే మొదటి కాల్ విజయవంతంగా చేశారు. 
 
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌ని ఉపయోగించి ప్రారంభ కాల్ చేశారు. ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొదటగా బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు దేశంలోని ప్రధాన నగరాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. 
 
బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ సిమ్‌కార్డు అన్ బాక్సింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత నెలలో జియో, ఎయిర్‌టెల్, వీఐ మొదలైన టెలికాం ఆపరేటర్లు విపరీతంగా ఛార్జీలను పెంచాయి. ఈ నేపథ్యంలో 4జీ, 5జీ కనెక్టివిటీతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ ప్రయత్నిస్తోంది.