మంగళవారం, 18 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 మార్చి 2025 (13:14 IST)

ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు.. రైలు కిందపడి యువ జంట ఆత్మహత్య? ఎక్కడ?

couple
ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని ఓ యువ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీం నగర్‌లో చోటుచేసుకుంది. సోషల్ మీడియా ప్రేమతో ఒక్కటైన ఆ జంట పెద్దలను ఒప్పించడంలో విఫలమైంది. దీంతో పెద్దల అంగీకారంతో తమ పెళ్లి జరగదనే మనస్తాపంతో ఆ జంట ఆత్మహత్యకు పాల్పడింది. 
 
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన మినుగు రాహుల్(18)కు.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్రచింతల్ గ్రామానికి చెందిన గోలేటి శ్వేత(20)కు మధ్య సామాజిక మాధ్యమంలో కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది
 
ప్రేమ విషయం తమ ఇంట్లో ఒప్పుకొరని, క్షణికావేశంలో ఇద్దరు జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ రైల్వేస్టేషన్-పాపయ్యపల్లె గేట్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.