ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (09:44 IST)

ఆహారం కల్తీలో హైదరాబాద్ ఫస్ట్.. సీఎం రేవంత్ పట్టించుకుంటారా?

food
హైదరాబాద్ నగరం ఆహార కల్తీలో టాప్‌లో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన నివేదికలో కాసుల కోసం కక్కుర్తి పడి హైదరాబాదులో జోరుగా కల్తీ జరుగుతోంది. 2022 ఏడాదికి గాను దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు హైదరాబాదులోనే నమోదయ్యాయి. అందులో 246 కేసులు హైదరాబాద్‌‌లోనే రికార్డయ్యాయి. 
 
ఐపీసీ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. మొత్తం 19 సిటీల్లో నమోదైన కేసుల్లో 84 శాతం కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదయ్యాయి. నిత్యావసర వస్తువులు మొదలుకుని.. చిన్న పిల్లలు తినే చాక్లెట్లు, ఐస్‌క్రీంలు కూడా కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కన్నేస్తే బాగుండునని నెటిజన్లు భావిస్తున్నారు.