ఆదివారం, 16 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 నవంబరు 2025 (12:32 IST)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారీ ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి

Jubilee Hills Bypoll
తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంలో దూసుకెళుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఈ స్థానం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి భారీ ఆధిక్యంలో దూసుకెళుతోంది. 
 
ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా ఎనిమిది రౌండ్లలోనూ ఆయనే లీడ్‌లో కొనసాగుతున్నారు. ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి 23 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 101 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 96 ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు 43, భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీతకు 25, భాజపా అభ్యర్థి దీపక్‌ రెడ్డికి 20 ఓట్లు లభించాయి.
 
మొదటి రౌండ్‌: నవీన్‌ యాదవ్‌ (కాంగ్రెస్‌): 8,911; మాగంటి సునీత (BRS): 8,864; దీపక్‌ రెడ్డి (భాజపా): 2167
రెండో రౌండ్‌: నవీన్‌ యాదవ్‌ (కాంగ్రెస్‌): 9,691; మాగంటి సునీత (BRS): 8,609; దీపక్‌ రెడ్డి (భాజపా): 3475
మూడో రౌండ్‌: నవీన్‌ యాదవ్‌ (కాంగ్రెస్‌): 11,082; మాగంటి సునీత (BRS): 8,082; దీపక్‌ రెడ్డి (భాజపా): 3,475
నాలుగో రౌండ్‌: నవీన్‌ యాదవ్‌ (కాంగ్రెస్‌): 9,567; మాగంటి సునీత (BRS): 6,020
ఐదో రౌండ్‌: నవీన్‌ యాదవ్‌ (కాంగ్రెస్‌): 12,283; మాగంటి సునీత (BRS): 8985