కాళ్లపారాణి ఆరకముందే.. తనువు చాలించిన నవ వధువు!!

Written By ఠాగూర్
Updated: సోమవారం, 9 డిశెంబరు 2024 (15:50 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నెన్నెల మండలంలో ఓ విషాదకర ఘటన జరిగింది. కాళ్ళపారాణి ఆరకముందే నవ వధువు తనువు చాలించింది. విద్యుదాఘాతం రూరంలో ఆమెను మృత్యువు కబళించగా, ఆమె కుటుంబ సభ్యులు, భర్త కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. నెన్నెలకు చెందిన జంబి స్వప్న (22) అదే గ్రామానికి చెందిన పల్లె సిద్ధు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈ నెల 4న వివాహం చేసుకున్నారు. అత్తగారింటికి వెళ్లిన స్వప్న ఆదివారం ఉదయం స్నానం చేయడానికి వాటర్ హీటర్ వాడారు. ఆ సమయంలో భర్త సిద్ధు బయటకు వెళ్లారు. 
 
ఈ క్రమంలో విద్యుత్తు పలుమార్లు ట్రిప్ అయ్యింది. విద్యుత్తు సరఫరా లేదనుకున్న స్వప్న నీటిలో చెయ్యి పెట్టి హీటర్ తీశారు. దీంతో విద్యుదాఘాతానికి గురవ్వడంతో కుటుంబసభ్యులు నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. 
 
సిద్ధుకు తండ్రి లేరు. తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో యువతి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందనుకుంటే విద్యుత్తు ప్రమాదం విషాదాన్ని మిగిల్చిందని అతను రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. 

అన్నీ చూడండి

గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం

పౌరసత్వాన్ని వదులుకుంటానంటున్న అఖిల్ అక్కినేని

కోర్కెలు తీర్చుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చా : రకుల్ ప్రీత్ సింగ్

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

తర్వాతి కథనం
Show comments