గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 25 జూన్ 2024 (12:42 IST)

మలంద్వారంలో దాచిన బంగారం.. గుర్తించిన ఎయిర్‌పోర్టు అధికారులు...

gold
బంగారాన్ని అక్రమంగా దిగుమతి చేసుకునేందుకు స్మగ్లర్లు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా, విదేశాల నుంచి ప్రయాణికులతో ఈ బంగారాన్ని అక్రమంగా పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు బంగారాన్ని తన మలంద్వారంలో దాచి తీసుకొచ్చాడు. దీన్ని ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
అబుదాబి నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ఓ ప్రయాణికుడిని అనుమానించిన కస్టమ్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, మలంద్వారంలో బంగారాన్ని దాచినట్టు గుర్తించారు. మలంద్వారంలో రూ.59 లక్షల విలువ చేసే 806 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని అబుదాబి నుంచి అక్రమంగా తీసుకొస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. ఆ ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

స్పాప్‌చాట్ డౌన్‌లోడ్‌కు అంగీకరించని తండ్రి... ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న బాలిక!! 
 
మొబైల్ ఫోనులో స్నాప్‌చాట్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు కన్నతండ్రి అంగీకరించలేదు. దీంతో ఆ బాలిక ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు... మహారాష్ట్రలోని థానేలోని డోంబివిలీ ప్రాంతానికి చెందిన బాలిక శుక్రవారం స్నాప్‌చాట్‌ను మొబైల్ ఫోనులో ఇన్‌స్టాల్ చేసుకునేందుకు ప్రయత్నించింది. దీన్ని గుర్తించిన తండ్రి... అందుకు నిరాకరించారు. 
 
యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ బాలిక.. ఆ రాత్రికే తన గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మరుసటి రోజు బాలిక మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Thane teen hangs self after father objects to downloading Snapchat on phone 
Thane Teen Han*s, Self, Father, Downloading Snapchat, Phone, థానే బాలుడు, స్నాప్‌చాట్, మొబైల్ ఫోన్, మహారాష్ట్ర