Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఇంటిని శుభ్రం చేయించుకుని.. సారా తాగించి.. మత్తులో ఇద్దరు మహిళలపై..?

Written By సెల్వి
Updated: శనివారం, 20 జులై 2024 (13:25 IST)
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇద్దరు మహిళా కూలీలపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలోని హజీపూర్‌లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బల్మూర్ మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలు అచ్చంపేటకు వచ్చి రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. 
 
గురువారం ఇంట్లో పని వుందని ఇద్దరు మహిళలను బండల దుకాణాలు నిర్వహించే ఇద్దరు వ్యక్తులు వినోద్ సింగ్, గజానంద్ సింగ్ తమతో తీసుకెళ్లారు. ఇంటిని శుభ్రం చేయించుకున్నారు. పని పూర్తయ్యాక మాటల్లో దింపి, ఇద్దరినీ కారులో ఎక్కించుకుని నల్గొండ జిల్లా డిండివైపు తీసుకెళ్లి మద్యం తాగించారు.  
 
హజీపూర్ శివారు ప్రాంతంలో కారు నిలిపి మత్తులో ఉన్న మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. సాయంత్రం అచ్చంపేట శివారులోని క్రీడా మైదానం సమీపంలో మహిళలను వదిలేశారు. 
 
అపస్మారక స్థితిలో ఉన్న మహిళలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments