ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 31 జులై 2024 (21:24 IST)

హైదరాబాద్‌లో జరగనున్న సాహిత్యోత్సవ్ జష్న్-ఏ-ఆదాబ్ సాంస్కృతిక కార్వాన్ విరాసత్

image
హిందుస్తానీ కళ, సంస్కృతి, సాహిత్యాన్ని వేడుక చేసే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమాలలో ఒకటైన సాహిత్యోత్సవ్ జష్న్-ఎ-అదాబ్ కల్చరల్ కార్వాన్ విరాసత్ మొదటిసారిగా హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమం 2024 ఆగస్టు 3వ, 4వ తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుండి MANUUలోని DDE ఆడిటోరియంలో జరుగనుంది. సాంస్కృతిక శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ (GoI) సహకారంతో ఈ సాంస్కృతిక మహోత్సవం నిర్వహించబడుతోంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) సహకారంతో హైదరాబాద్‌లో ఈ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక  సాంస్కృతిక కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి గౌరవనీయులైన హిందుస్థానీ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
 
అందరికీ ప్రవేశం ఉచితం
ఈ రెండు రోజుల కార్యక్రమం అత్యద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుందనే  వాగ్దానం చేస్తుంది:
03 ఆగస్టు, 2024, 1వ రోజు (మధ్యాహ్నం 2.00 గంటల నుండి)
 
పద్మశ్రీ ప్రొఫెసర్ అశోక్ చక్రధర్‌ ; MANUU యొక్క గౌరవనీయ వైస్-ఛాన్సలర్, ప్రొ. ఐనుల్ హసన్ ; ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ సెయెద్ ఇ. హస్నైన్;  తెలంగాణ కస్టమ్స్, జీఎస్టీ  ప్రధాన కమిషనర్, శ్రీ సందీప్ ప్రకాష్; ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్, ఆంధ్ర- తెలంగాణ శ్రీమతి మితాలి మధుమిత; జష్న్-ఎ-అదాబ్, అధ్యక్షుడు శ్రీ నవనీత్ సోనీ IRS, కవి మరియు సాహిత్యోత్సవ్ జష్న్-ఎ-అదాబ్ వ్యవస్థాపకుడు కున్వర్ రంజీత్ సింగ్ తో సహా విశిష్ట అతిథులు హాజరు కాగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది.
 
ప్రారంభ వేడుకల తరువాత, సాయంత్రం ఆకర్షణీయమైన ప్రదర్శనలు, కార్యకలాపాలను కలిగి ఉంటుంది. ఈ కార్యక్రమంలో డెక్కనీ ఉర్దూపై పర్షియన్ ప్రభావాన్ని అన్వేషిస్తూ ప్రొఫెసర్ ఐనుల్ హసన్, అజ్మ్ షాకిరీలతో ‘డెక్కనీ ఉర్దూ మే ఫార్సీకే అస్రాత్’పై సంభాషణను కలిగి ఉంది. దీని తర్వాత దక్కనీ షేరీ మెహ్ఫిల్ ఉంటుంది. దక్షిణ భారతదేశానికి చెందిన ప్రసిద్ధ కవులు లతీఫుద్దీన్ లతీఫ్, వాహెద్ పాషా క్వాద్రీ, షాహెద్ అదీలీ, మీర్ బిద్రీ, చాచా పాల్మూరి, ఫరీద్ సహర్, హమీద్ సలీ దీనిలో పాల్గొంటారు. ఈ ప్రాంతంలోని గొప్ప కవితా సంప్రదాయాన్ని హైలైట్ చేస్తూ కులీ కుతుబ్ షా, హైదరాబాద్, ఔర్ దక్కనీ అదాబ్ చర్చా వేదికగా ఉంటుంది. కఫీల్ జాఫ్రీచే దస్తాన్-ఎ-ఇష్క్- దస్తాంగోయ్ ప్రదర్శన-సిఫార్సు చేయబడింది. డా. విద్యా షా దాద్రా, తుమ్రీ మరియు గజల్‌ల సమ్మేళనాన్ని, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలోని సూక్ష్మ వ్యక్తీకరణల ద్వారా ప్రదర్శిస్తారు. ఈ సాయంత్రం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తామని వాగ్దానం చేస్తూ అత్యంత ప్రజాదరణ పొందిన వార్సీ బ్రదర్స్ శక్తివంతమైన ఖవ్వాలి ప్రదర్శన చేయటం తో  ముగుస్తుంది.
 
03 ఆగస్టు, 2024- 1వ రోజు (మధ్యాహ్నం 2.00 గంటల నుండి)
రెండవ రోజు బైత్‌బాజీ: ఎ గేమ్ ఆఫ్ ఉర్దూ పొయెట్రీతో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత డాక్టర్ మమతా జోషి & బృందంచే సూఫీ గానం జరుగుతుంది. అనంతరం ఉర్దూలో శ్రీమద్ భగవద్గీత పఠనం అహ్మద్ రషీద్ షేర్వానీ, జాతీయ అవార్డు గ్రహీత కూచిపూడి నృత్యకారిణి యామినీ రెడ్డిచే నృత్య ప్రదర్శన (నృత్య ధార) ఉంటుంది. అమిల్ సియాల్, మను రిషి చద్దా మరియు ఫైసల్ మాలిక్ వంటి ప్రముఖ నటులు పాల్గొనే ప్యానెల్ చర్చ ‘సినిమా ఓటిటి  మరియు థియేటర్: సమాజిక్ సరోకర్ యా మనోరంజన్’లో ప్రియమైన నటీనటులను వినే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం ముగింపు కార్యక్రమంతో పాటుగా మెహ్ఫిల్-ఎ-సుఖాన్: ముషాయిరా మరియు కవి సమ్మేళన్‌లో పద్మశ్రీ ప్రొ. అశోక్ చక్రధర్, మదన్ మోహన్ డానిష్, తాహిర్ ఫరాజ్, మొయిన్ షాదాబ్ మరియు ఇతరులు వేదికపైకి వచ్చి  వారి కవిత్వం పఠిస్తారు.
 
ఈ కార్యక్రమంపై కవి మరియు సాహిత్యోత్సవ్ జష్న్-ఎ-ఆదాబ్ వ్యవస్థాపకుడు కున్వర్ రంజీత్ చౌహాన్ మాట్లాడుతూ, "సాహిత్యోత్సవ్ జష్న్-ఎ-అదాబ్ సాంస్కృతిక కార్వా'న్ విరాసత్ ఒక భారతీయ రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి తరలివెళుతోంది, మరింత మంది ప్రజలను శక్తివంతమైన హిందుస్థానీ కళ, సంస్కృతి మరియు సాహిత్యంతో కలుపుతోంది. అనేక రాష్ట్రాలలో అద్భుతమైన విజయాన్ని సాధించిన తరువాత, మేము ఈ కార్యక్రమాన్ని సాంస్కృతికంగా సంపన్నమైన హైదరాబాద్‌కు తీసుకురావడానికి సంతోషిస్తున్నాము. మా వేదికపై  మహోన్నతమైన మరియు గౌరవప్రదమైన కళాకారులను కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ మహోన్నత కళాకారుల ప్రతిభను ప్రత్యక్షంగా తిలకించేందుకు తరలిరావాల్సిందిగా మేము ప్రోత్సహిస్తున్నాము. మన హిందూస్థానీ కళలు, సంస్కృతి, సాహిత్యం యొక్క చైతన్యంతో భారతీయ యువతను అనుసంధానించడం మరియు అర్ధవంతమైన కళకు చేరువ చేయడమే మా లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని సాధ్యం చేయడంలో తమ అమూల్యమైన మద్దతు అందించిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ- ఇన్‌క్రెడిబుల్ ఇండియా(GoI)కు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము" అని అన్నారు. 
 
ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, చండీగఢ్, బీహార్, గుజరాత్ మరియు జమ్మూ & కాశ్మీర్‌తో సహా అనేక రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సాహిత్యోత్సవ్ జష్న్-ఎ-ఆదాబ్ కల్చరల్ కార్వా'న్ విరాసత్ 2024 నిర్వహించబడింది మరియు మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం హిందుస్థానీ కళ, సంస్కృతి మరియు సాహిత్యం రూపంలో భద్రపరచబడిన మన దేశ వారసత్వం యొక్క సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది.