శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2024 (15:19 IST)

ట్రక్కును ఢీకొన్న కారు.. ఇద్దరు యువకులు మృతి.. అతివేగమే...

road accident
నిజామాబాద్‌-జన్నేపల్లి రహదారిపై శ్రీనగర్‌ గ్రామ సమీపంలో బుధవారం నిలిచిన ట్రక్కును కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
మృతులు మాక్లూర్ మండలం చిక్లి గ్రామానికి చెందిన దండ్ల వంశీకృష్ణ (17), నిజామాబాద్ రూరల్ మండలం న్యాల్‌కల్‌కు చెందిన రాజేష్ (18)గా గుర్తించారు. 
 
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌లోని దుబ్బాకకు చెందిన వంశీకృష్ణ, రాజేష్‌, వారి స్నేహితుడు ఆకాష్‌లు బుధవారం నిజామాబాద్‌ నుంచి చిక్లికి కారులో వెళ్లారు.

గజానన్ రైస్ మిల్లు వద్దకు రాగానే రోడ్డు పక్కన మట్టిపై కూరుకుపోయిన లారీని వారి వాహనం ఢీకొట్టింది. వంశీకృష్ణ, రాజేష్ అక్కడికక్కడే మృతి చెందారు. బాటసారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన ఆకాశ్‌ను నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 
 
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.