సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జనవరి 2025 (09:51 IST)

ఆంధ్రా అల్లుడికి తెలంగాణ అత్తింటివారు సర్‌ప్రైజ్ - 130 రకాల వంటకాలు (Video)

andhra son in law foods
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నగరానికి వచ్చిన ఆంధ్రా అల్లుడు అత్తింటివారు చేసిన మర్యాదలు అబ్బురపరుస్తున్నాయి. పెళ్లయిన తర్వాత తొలిసారి తమ ఇంటికి వచ్చిన అల్లుడుకి అత్తమామలు ఏకంగా 130 రకాలైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. కాకినాడకు చెందిన తమ అల్లుడుకి తెలంగాణ వంటకాలు రుచి చూపించి ఆనందపరిచారు. 
 
సరూర్ నగర్ సమీపంలోని శారదా నగర్‌లో నివాసం ఉండే క్రాంతి - కల్పన దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కుమార్తెను కాకినాడకు చెందిన మల్లిఖార్జునతో నాలుగు నెలల క్రితం వివాహం జరిపించారు. సంక్రాంతికి తొలిసారి అల్లుడు రావడంతో ఆయనకు తెలియకుండా సర్‌ప్రైజ్ చేసేందుకు పిండివంటలతోపాటు మాంసాహారం, శాఖాహారం, పులిహోరా, బగారా ఇలా ఏకంగా 130 రకాల వంటలు వడ్డించి ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.