గురువారం, 31 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2024 (08:22 IST)

కోదాడలో ఘోరం.. ఆగివున్న కారును ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మరణం!!

road accident
తెలంగాణ రాష్ట్రంలోని కోదాడలో ఘోరం జరిగింది. ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో మహిళ ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘోరం గురువారం తెల్లవారుజామున 65వ నంబరు జాతీయ రహదారిపై జరిగింది. 
 
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న కారు ఒకటి సూర్యాపేట జిల్లా కోదాడ శివారు ప్రాంతమైన దుర్గాపురం వద్ద రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్ర, కారు అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగివుంటుందని ప్రాథమికంగా భావిస్తున్నట్టు చెప్పారు. 
 
సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.