Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనను మేడం అని పిలవద్దు ప్లీజ్... సీతక్క అని పిలిస్తే చాలు : మంత్రి సీతక్క

Written By ఠాగూర్
Updated: గురువారం, 28 డిశెంబరు 2023 (18:21 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ఆ రాష్ట్ర అధికారులకు ఓ విజ్ఞప్తి చేశారు. తనను మేడమ్ అని పిలవద్దని ఆమె కోరారు. సీతక్క అని పిలిస్తే సరిపోతుందని అధికారులకు సూచించారు. గత నెలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె గెలుపొందారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆమె అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం జామినిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆమెను పలువురు ఉన్నతాధికారులు మేడమ్ అంటూ సంభోధించసాగారు. ఈ పిలుపు ఆమెకు అసౌకర్యంగా అనిపించింది. అందుకే తనను మేడమ్ అని పిలవద్దని, సీతక్క అని పిలిస్తే చాలని సూచించారు. మేడం అంటే దూరం అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. నన్ను సీతక్క అంటేనే మీ చెల్లిగా, అక్కడా కలిసిపోతాం అని వ్యాఖ్యానించారు. 
 
పదవులు శాశ్వతం కాదని, విలువలు, మంచి పనులే మనకు శాశ్వతమన్నారు. కాంగ్రెస్ పాలన అంటే గడీల పాలన కాదని, గల్లీ బిడ్డల పాలన అని పేర్కొన్నారు. ప్రజలకు ఎపుడు ఏం అవసరమున్నా తమతో చెప్పుకోవచ్చని ప్రజలకు ధైర్యం చెప్పారు. కాగా, అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా, ఆమె జామినాలో గురువారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

అన్నీ చూడండి

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

అమీర్ లోగ్ చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపిస్తోంది : సాయి మార్తాండ్

తర్వాతి కథనం
Show comments