Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవతి భర్తకు వేణుస్వామి ఆర్థిక సాయం.. అల్లు అర్జున్‌ జాతకంలో...

Written By ఠాగూర్
Updated: గురువారం, 26 డిశెంబరు 2024 (11:15 IST)
ప్రముఖ జ్యోతిష్యుడుగా గుర్తింపు పొందిన వేణుస్వామి ఓ మంచిపని చేశారు. 'పుష్ప-2' ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి అనే మహిళ భర్త భాస్కర్‌కు ఆయన తన వ్యక్తిగతంగా రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. అలాగే, మృతురాలి కుమారుడు శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అతని తండ్రి భాస్కర్‌ను అడిగి తెలుసుకుని, భాస్కర్‌కు రూ.2 లక్షల చెక్కును అందజేశాడు. 
 
ఈ సందర్భంగా వేణుస్వామి మాట్లాడుతూ, శ్రీతేజ్ ఆరోగ్యం కోసం వారం రోజుల్లో మృత్యుంజయ హోమాన్ని తన సొంత ఖర్చులతో నిర్వహిస్తానని ప్రకటించారు. ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ జాతకంలో శని ఉందని, అందుకే ఈ సంఘటన చోటుచేసుకుందన్నారు. 
 
వచ్చే యేడాది మార్చి వరకు అల్లు అర్జున్ జాతకం ఇలానే ఉంటుందని చెప్పారు. ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు సహజమన్నారు. ఎవరూ ఏదీ కావాలని చేయరని అన్నారు. అలాంటిదే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన అని చెప్పారు. 

అన్నీ చూడండి

Merlapaka Gandhi :కొన్నిసార్లు ఆ కథ నాకే నచ్చదు, గేప్ కు కారణం అదే : మేర్లపాక గాంధీ

గాయం రూపంలో దేవుడు బలవంతంగా సెలవు ఇచ్చాడు : రష్మిక మందన్నా

Tej: ప్రాజెక్ట్‌లో ఆయన భాగం కావాలనే కోరిక ఉంది : దందా డైరెక్ట‌ర్ ఆదిత్య దేవులపల్లి

Sid Sriram: ది రెడ్ బ్యాగ్ నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన మెలోడీ సాంగ్

డీప్‌ఫేక్ ఫోటోలు తక్షణం తొలగించండి.. లేదా చట్టపరమైన చర్యలు : మృణాల్ ఠాకూర్

తర్వాతి కథనం
Show comments