ఆపరేషన్ చేసి పాము ప్రాణం పోసిన వెటర్నరీ డాక్టర్ (వీడియో)

ఠాగూర్
బుధవారం, 24 సెప్టెంబరు 2025 (19:22 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ వెటర్నరీ వైద్యుడు పాముకు వైద్యం చేశారు. ఈ పాము గాయపడటంతో దానికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడాడు. సాధారణంగా పాము కనిపిస్తే అనేక మంది భయపడిపోతారు. లేదా దాన్ని చంపేందుకు చూస్తారు. కానీ, ఈ వైద్యుడు చేసిన పనికి ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు.
 
జిల్లాలోని చంద్రంపేట గ్రామానికి చెందిన కాటిపాములకు చెందిన వ్యక్తి ఇంటిలో ఉన్న పాముపై గడ్డపార పడింది. దీంతో ఆ పాము పొట్టలోనుంచి పేగులు బయటకు వచ్చాయి. దీంతో ఆ ఇంటి యజమాని సిరిసిల్ల పశువైద్యాధికారి అభిలాష్‌ను సంప్రదించగా, ఆయన ఆ పాముకు ఆపరేషన్ చేసి పేగులను తిరిగి యధాతథ స్థితిలో అమర్చి, ఆరు అంగుళాల మేరకు కుట్లు వేశారు. ఈ పామును మూడు రోజుల పాటు పరిశీలనలో ఉంచి చికిత్స అందిచారు. ప్రస్తుతం ఈ పాము ఆరోగ్యంగా ఉందని డాక్టర్ చెప్పారు. 


 

అన్నీ చూడండి

నా బిడ్డను కోల్పోయినందుకు సీఎం విజయే కారణం.. జూలీ షాకింగ్ కామెంట్స్

క్యాస్టింగ్ కౌచ్‌పై నటి అపూర్వ కామెంట్లు... పిలిచినప్పుడు వెళ్లకపోతే ఏం చేస్తారంటే?

ఔత్సాహిక నటీనటులను ఆహ్వానిస్తున్న రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్

సుస్మితా సేన్ ఓ డైమండ్ డిగ్గర్.. కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా ఉండేవాడిని: లలిత్ మోదీ

తర్వాతి కథనం
Show comments