ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఆగస్టు 2024 (14:27 IST)

అధికారులు వేధింపులు.. జీతం ఇవ్వట్లేదు.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని..? (video)

crime scene
అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. విజయ్ కుమార్‌ తనకు జీతం చెల్లించకపోవడం, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వేధింపుల కారణంగా నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. 
 
ఒంటిపై పెట్రోల్ పోసుకున్న తర్వాత అగ్గిపెట్టె చేతిలోకి తీసుకున్నాడు. కానీ అంతలోనే ఇతర కార్మికులు జోక్యం చేసుకున్నారు. మేయర్ బంగి అనిల్ కుమార్, ఇతర సిబ్బంది అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రామగుండం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.