సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (09:58 IST)

14 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం.. ఎక్కడంటే..?

కరోనా ఓవైపు జనాలకు చుక్కలు చూపిస్తుంటే.. కామాంధుల దుశ్చర్యలు ఏమాత్రం ఆగట్లేదు. దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో మహిళలపై వయోభేదం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా మైనర్ బాలికపై మరో మైనర్ బాలుడు లైంగికదాడికి పాల్పడాడు. ఈ ఘటనపై ఖమ్మం జిల్లా రఘునాథపాలెం పోలీసు స్టేషన్ లో ఆదివారం రాత్రి కేసు నమోదు అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. రఘునాథపాలెం మండలానికి చెందిన ఓ 14 ఏండ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 16 ఏండ్ల బాలుడు శనివారం రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లగా ఒంటరిగా ఉండటం గుర్తించి ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి తిరిగి వచ్చిన తండ్రికి బాలిక విషయం చెప్పింది. దీనిపై ఆయన ఫిర్యాదు మేరకు ఆదివారం రాత్రి కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై వివరించారు.