శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (09:04 IST)

తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండం : 2 రోజులు బయటకు రావొద్దు

తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపించనున్నారు. రెండు రోజుల పాటు రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని, ఏ ఒక్కరూ తమతమ ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 
 
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో భానుడి ప్రతాపం అధికంగా ఉంటుందని, దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణంతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 
 
ఆపై ఎండ వేడిమి స్వల్పంగా తగ్గుతుందని అంచనా వేశారు. విదర్భ నుంచి మరాట్వాడా వరకూ, కర్ణాటక నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణులు కొనసాగుతుండటమే ఇందుకు కారణమని ఓ అధికారి వెల్లడించారు. 
 
ఇదేసమయంలో ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఎండ వేడిమి అధికంగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసరమైతేనే, తగు జాగ్రత్తలు తీసుకుని ప్రజలు బయటకు రావాలని సూచించారు.