టీ20 క్రికెట్‌లో ధనాధన్.. మూడు మ్యాచ్‌ల్లో ఎన్ని సిక్స్‌లు కొట్టారంటే..?
టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ ధనాధన్ బ్యాటింగ్‌తో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తారు. ప్రతీ బంతిని ఫోర్, లేదా సిక్స్ బాదాలనే కసితో ఉంటారు. సింగిల్స్ కన్నా బౌండరీలు బాదుతూ ఎక్కువ పరుగులు రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా జరిగిన మొదటి మూడు మ్యాచ్‌ల్లో విచిత్రంగా ఎక్కువ సిక్సర్లు కొట్టిన జట్లు ఓటమిపాలయ్యాయి.
ఆదివారం రాత్రి వరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ఫై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది. ఇక ఆదివారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ మట్టికరిపించింది.
ఇకపోతే.. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ మూడు మ్యాచ్‌ల్లో ఏయే జట్టు ఎన్ని సిక్స్‌లు కొట్టారంటే.. ముంబై ఇండియన్స్ (6 సిక్స్‌లు) vs ఆర్సీబీ (4 సిక్స్‌లు) చెన్నై(10) vs డీసీ (5), కేకేఆర్ (8) vs ఎస్ఆర్‌హెచ్ (10) సాధించాయి.