ఐపీఎల్-14 సీజన్.. కోహ్లీ సేన అదుర్స్.. ముంబై ఇండియన్స్‌కు చుక్కలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14 సీజన్ ఆరంభమైంది. ఐపీఎల్ 14 వ సీజన్ మొదటి మ్యాచ్‌లోనే కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు జట్టు దుమ్ములేపింది. డిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు చుక్కలు చూపించింది ఆర్సీబీ.
చివరి వరకు ఉత్కంఠ రేపి ఆఖరి బంతికి ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఘన విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్ మైదానంలో శుక్రవారం జరిగిన ఐపీఎల్-14 తొలి మ్యాచ్‌లో బెంగళూరు 2 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను ఓడించింది.
తొలుత ముంబై 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఆ జట్టును "మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ " హర్షల్ పటేల్ {5-27} గట్టి ఎదురుదెబ్బ కొట్టాడు. ఇక క్రిస్ లిన్ 35 బంతుల్లో 49 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అటు ఛేజింగ్‌లో కెప్టెన్ కోహ్లీ 33 పరుగులు, మ్యాక్స్‌వెల్ 39 పరుగులు చేసి.. రాణించగా.. మిడిలాడర్‌లో 48 పరుగులు చేసి... డివిలియర్స్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఇక ముంబై జట్టులో బుమ్రా 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా.. జాన్సెన్ 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కాగా.. స్టార్ బ్యాట్‌మెన్ ఏబీ సిక్స్‌ర్లు, పోర్లతో జట్టును విజయం ముంగిట నిలపడం బెంగళూరు ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నింపింది.
ఇకపోతే.. 'ధనాధన్' ధోనీ నాయకత్వం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, టీమిండియా యువకెరటం, 'పవర్ హిట్టర్' రిషభ్ పంత్ కెప్టెన్‌గా ఉన్న దిల్లీ క్యాపిటల్స్.. మధ్య రెండో లీగ్ మ్యాచ్ శనివారం జరగనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచుల్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి.