బుధవారం, 27 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (22:31 IST)

స్టోక్స్ సిక్సర్ల మోత, రెండో వన్డేలో టీమిండియా పరాజయం

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా పరాజయం చవిచూసింది. 336 పరుగుల లక్ష్యం పెద్దదే అని టీమిండియా అనుకుని వుండొచ్చు కానీ ఇంగ్లాండ్ జట్టు ఆ లక్ష్యాన్ని టి-20 మాదిరిగా సిక్సర్ల మోతతో భారత బౌలర్లపై విరుచుకుపడి మరో 39 బంతులు మిగిలి వుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీనితో ఇంగ్లాండ్ భారత జట్టుపై ఘన విజయం సాధించింది.
 
తొలుత జాన్సన్- బెయిర్‌స్టో బ్యాటింగుకి దిగారు. ఇద్దరూ కలిసి స్కోర్ కార్డును పరుగులు పెట్టించారు. 16 ఓవర్లకే 100 పరుగులు దాటించేశారు. ఐతే జాన్సన్(55 పరుగులు) లేని పరుగు కోసం ప్రయత్నించడంతో దొరికిపోయాడు. ఐతే ఈ వికెట్ తీయడంతో ఆ స్థానంలో వచ్చిన స్టోక్స్ అల్లాడించాడు. కేవలం 52 బంతుల్లో ఏకంగా 10 సిక్సర్లు, 4 ఫోర్లు కొట్టాడు. స్టోక్స్ సెంచరీకి మరో పరుగు దూరంలో వుండగా పంత్ చేతికి చిక్కాడు.
 
ఐతే అప్పటికే ఇంగ్లాండ్ విజయ లక్ష్యానికి చేరువకు వచ్చేసింది. 2 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. చేతిలో వికెట్లు ఓవర్లు వుండటంతో ఆడుతూపాడుతూ విజయ లక్ష్యానికి చేరుకున్నారు. ఇన్నింగ్సులో బెయిర్‌స్టో 124 పరుగులు చేశాడు. అతడు 7 సిక్సర్లు, 4 ఫోర్లు కొట్టి జట్టు విజయానికి గట్టి పునాది వేశాడు. ఆ తర్వాత వచ్చిన డేవిడ్-బట్లర్ ద్వయంలో బట్లర్ డకౌట్ అయి వెనుదిరిగాడు. డేవిడ్‌కి(16 పరుగులు) జత కలిసిన లియామ్(27 పరుగులు) కలిసి సునాయసంగా జట్టును విజయ తీరాలకు చేర్చారు.