సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (19:51 IST)

థ్రిల్ల‌ర్ కోసం బి రెడీ అంటున్న అప‌ర్ణ

Aparna
రామ్‌గోపాల్ వ‌ర్మ గెట్ రెడీ అంటున్నాడు త‌న అభిమానుల‌ను. 2020లోనే తాను తీసిన `థ్రిల్ల‌ర్‌` క‌న్న‌డ సినిమాను తెలుగులోకూడా విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. అప్పుడే ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశాడు. ఇది ఓటీటీలో విడుద‌ల‌చేయాల‌ని అనుకున్నారు. ప్ర‌స్తుతం అప‌ర్ణ‌రాణి కూడా త‌న లేటెస్ట్ స్టిల్‌ను సోష‌ల్‌మీడియాలో పోస్ట్‌చేసింది. త్వ‌ర‌లో మీముందుకు వ‌స్తానంటూంది. ఇప్ప‌టికే ఆమె ఐటంసాంగ్ సీటీమార్ సినిమాలో చేసింది.

ఇక థ్రిల్ల‌ర్ ట్రైల‌ర్‌లో వ‌ర్మ త‌న చేయాల్సినంత‌గా అప‌ర్ణ‌ను ప్ర‌మోట్ చేసేశాడు. కాళ్ళ సందులోంచి కెమెరా యాంగిల్ పెట్టి తీశాడు. ఆమె వ‌స్త్రధార‌ణ మార్చుకున్న స‌న్నివేశాన్ని కూడా తెలుగులో ఎవ‌రూ తీయ‌ని విధంగా తీశాడు. ఇలా తీసి త‌న‌దైన మార్కును క్రియేట్ చేశాడు. ఈ సినిమా థియేట‌ర్ల‌లో వ‌స్తుందో రాదో తెలీదుకానీ. ఆయ‌న‌కంటే అప‌ర్ణ తెగ ప్ర‌మోష‌న్ చేస్తోంది. ఇలాంటి పాత్ర‌లు చేయాలంటే న‌టిగా నాకు ఎటువంటి అభ్యంత‌రంలేద‌ని పేర్కొంటుంది. పాత్ర‌లు కూడా ప‌రిమితంగా వున్న ఈ సినిమాను ఎ కంపెనీ ప్రొడ‌క్ష‌న్‌, సౌత్ ప్ల‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి.