హైదరాబాద్ పేకాట స్థావరాలపై దాడులు... 17 మంది అరెస్టు
హైదరాబాద్ నగరంలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ కల్చర్‌కు కేంద్రంగా మారింది. మరోవైపు పేకాట రాయుళ్లు కూడా ఎక్కువైపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ బంజారా హిల్స్ ఏరియాలోని పలు క్లబ్బులు వంటి పేకాట స్థావరాలపై సోదాలు నిర్వహించారు.
బుధవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు ఈ దాడులు చేయగా, మొత్తం 17 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.75 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఆరుగురు మహిళలు కూడా ఉండటం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పేకాట క్లబ్ నిర్వాహకులు, జూదగాళ్లపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.