మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శుక్రవారం, 9 మార్చి 2018 (14:33 IST)

12 ఏళ్ల విద్యార్థినిపై 50 ఏళ్ల ఆటో డ్రైవర్ అత్యాచారం... ఆటోలో స్కూలుకు తీసుకెళుతూ...

ఆటో డ్రైవరును నమ్మినందుకు విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని చిలకలగూడలో జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... చిలకలగూడలో 7వ తరగతి చదువుకుంటున్న విద్యార్థినిని 50 ఏళ్ల ఆటో డ్రైవరు రోజువారీ విద్యార్

ఆటో డ్రైవరును నమ్మినందుకు విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని చిలకలగూడలో జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... చిలకలగూడలో 7వ తరగతి చదువుకుంటున్న విద్యార్థినిని 50 ఏళ్ల ఆటో డ్రైవరు రోజువారీ విద్యార్థిని ఇంటి నుంచి స్కూలుకు తీసుకెళుతుంటాడు. 
 
ఇందులో భాగంగా ఆమెను ఆటోలో ఎక్కించుకుని స్కూలుకని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. దాంతో భయపడిన విద్యార్థిని నెల రోజులుగా దాచి పెట్టింది. ఐతే ఆమె ఏదో విషయంపై చింతిస్తున్నట్లు తల్లిదండ్రులకు అనుమానం రావడంతో బాలికను విచారించారు. దాంతో విషయాన్ని చెప్పేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.