ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (17:56 IST)

గాఢంగా ప్రేమించాడు.. ప్రియురాలిని స్నేహితుని కోర్కె తీర్చమన్నాడు.. ఆ తరువాత..?

నిజమైన ప్రేమకు చావే లేదన్న సామెత ఉంది. అందుకే చాలామంది ప్రేమికులు ప్రేమించి పెళ్ళి చేసుకుని జీవితాంతం కలిసి ఉంటారు. ప్రేమించుకున్న తరువాత ఒకరినొకరు అర్థం చేసుకుని తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. తాను ప్రేమించిన వ్యక్తి తన కోసం ప్రాణమిస్తాడని నమ్మింది ఓ యువతి. సర్వం అతనికి అర్పించుకుంది. అయితే ఆ దుర్మార్గుడు తన కోర్కెను తీర్చుకోవడమే కాకుండా ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. తన స్నేహితుని కోర్కె తీర్చమంటూ బెదిరించాడు. దీంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. 
 
ఉప్పల్ వెంకటరెడ్డి కాలనీకి చెందిన ఉష స్థానికంగా ఉన్న ప్రైవేటు కళాశాలలో బిటెక్ చదువుతోంది. ఉష తల్లిదండ్రులు ఐదు సంవత్సరాల క్రితం మరణించారు. ఆమెకు పెద్ద దిక్కు అన్నయ్య రాజేష్ ఒక్కడే. చెల్లెలిని ఎంతో గారాభంగా చూసుకునేవాడు. బిటెక్ చదువుతున్న ఉష వేణు అనే యువకుడ్ని ప్రేమించింది. వేణు ప్రేమ నిజమని నమ్మింది. 
 
పెళ్ళి చేసుకుంటానని చెప్పడంతో అతనితో శారీరకంగా కలిసింది. తనతో ఉష శారీరకంగా కలిసిన దృశ్యాలను తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు వేణు. అంతటితో ఆగలేదు. తన స్నేహితుడు క్రిష్ణకు ఆ వీడియోలను చూపించాడు. దీంతో క్రిష్ణ కూడా ఉషతో ఆ సుఖం కావాలన్నాడు. దీంతో వేణు ఉషకు ఫోన్ చేసి వీడియోలను ఫేస్ బుక్‌లో పెడతానని, తన స్నేహితుని కోర్కె తీర్చమని బెదిరించాడు.
 
విషయం ఎక్కడ బయటకు తెలిసిపోతోందోనన్న భయంతో ఉష ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బి టెక్‌లో మార్కులు రాకపోవడం వల్లనే తన చెల్లెలు ఆత్మహత్య చేసుకుందని అన్న రాజేష్ మొదట్లో భావించాడు. రెండు రోజుల తరువాత చెల్లెలి ఫోన్ చూడగా అందులో వేణుతో కలిసి ఉన్న వీడియోలు బయటపడ్డాయి. దీంతో వేణును గట్టిగా ప్రశ్నించాడు. అసలు విషయం వేణు చెప్పేశాడు. దీంతో వేణు, క్రిష్ణలను చంపాలని ప్లాన్ చేశాడు. తన గదిలో వేణు ఒంటరిగా ఉన్న సమయంలో అతన్ని రాడ్‌తో కొట్టి చంపేశాడు. ఆ తరువాత వేణు సెల్ నుంచి క్రిష్ణకు ఫోన్ చేసి ఉప్పల్‌లోని ఒక ఫ్యాక్టరీ వద్దకు రమ్మని చెప్పి అతన్ని కూడా హత్య చేశాడు. వరుస హత్యలు చేసి ఉప్పల్ పోలీసులకు లొంగిపోయాడు రాజేష్.