Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

నీళ్లు కలపకుండా ఫుల్ బాటిల్ మద్యం తాగాలి.. ఛాలెంజ్ ప్రాణం తీసింది..

Written By సెల్వి
Updated: శనివారం, 24 అక్టోబరు 2020 (10:44 IST)
సోషల్ మీడియాలో ప్రస్తుతం అనేక ఛాలెంజ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఇదే ట్రెండ్ ప్రస్తుతం అన్నీ విషయాల్లో ఆచరిస్తోంది యువత. స్నేహితుల మధ్య చిన్న చిన్న పనులకే ఛాలెంజ్‌లు విసురుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్‌గా మారింది. తాజాగా మద్యం చాలెంజ్ ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. స్నేహితుల మధ్య సరదాగా సాగిన పందెం కాస్త వికటించి విషాదాన్ని నింపింది. 
 
నీళ్లు కలపకుండా ఫుల్ బాటిల్ మద్యం ఒక్కడే తాగడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ శాంతినగర్‌లో చోటుచేసుకుంది. కొంతసేపటికి నోటీ నుంచి నురుగ రావడం మొదలైంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ పరిస్థితి విషమించింది. దీంతో అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
 
వివరాల్లోకి వెళితే.. సోమేశ్వరం సాయిలు(40) తన ఐదుగురు స్నేహితులతో కలిసి శివారులో ఉన్న పంట పొలానికి వెళ్లాడు. అందరూ కలిసి పార్టీ చేసుకునేందుకు మద్యం తెచ్చుకున్నారు. భాగా తాగిన తర్వాత మాటా మాటా పెరిగి పందెం వరకు వెళ్లింది. 
 
ఇద్దరు వ్యక్తులు నీళ్లు కలపకుండా ఫుల్ బాటిల్ తాగుతామని పందెం కాశారు. ఆ తర్వాత అంతా ఇంటికి చేరుకోగా.. కొంతసేపటికి సాయిలు నోటీ నుంచి నురుగ రావడం మొదలైంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. మందు పందెం సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.

అన్నీ చూడండి

Vishwak Sen : తరుణ్ భాస్కర్ రచన, విశ్వక్సేన్ దర్శకత్వంలో కల్ట్ షూటింగ్ పూర్తి

Navdeep: సొంత ఊరిలో స్కూల్‌, మొహబ్బత్‌ సినిమా తీసినందుకు హాట్సాప్ : నవదీప్

Venu Swamy: చిన్న చిత్రాలు తెలుగులో మంచి విజయాలు సాధిస్తున్నాయి : వేణు స్వామి

NTR Warning : ఇది నిజంగా సిగ్గుమాలిన చర్య.. ఎవ్వరినీ వదిలిపెట్టను : ఎన్.టి.ఆర్.

Aadhi Pinisetty : ఆది పినిశెట్టి మరకతమణి 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు

తర్వాతి కథనం
Show comments