Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి

Updated: శుక్రవారం, 30 జులై 2021 (20:12 IST)
కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో ముద్రించాల‌ని తెలంగాణా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తాల‌ని, టీ.ఆర్.ఎస్. ఎంపీలకు బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి ప్రతినిధుల విజ్ఞప్తిపై ఆయ‌న ఇలా స్పందించారు.

కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ కమిటీ ప్రతినిధులు శుక్రవారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. తమ డిమాండ్ కు మద్దతు ఇవ్వాలని వినోద్ కుమార్ ను కోర‌గా, ఈ డిమాండ్ న్యాయ సమ్మతమైనదేనని అన్నారు.

ఈ అంశాన్ని పార్లమెంటు వేదికగా లేవనెత్తాలని టీ.ఆర్.ఎస్. పార్టీ ఎంపీలకు ఆయన సూచించారు. దేశంలో రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ అని, అలాంటి మహానీయున్ని గౌరవించుకోవడం కనీస బాధ్యత అని ఆయన అన్నారు. కమిటీ చేపట్టిన ఆగస్టు 3,4,5 తేదీలలో " చలో ఢిల్లీ " వాల్ పోస్టర్ ను ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ కమిటీ జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురాం, నాయకులు స్వామి, నర్సింహులు, ఆశీర్వాదం, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments