శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 మార్చి 2022 (17:31 IST)

సజ్జనార్ సార్... సజ్జనార్ అంతే: తెలంగాణ ఆర్టీసి ఎమ్.డి మరో కొత్త పథకం, ఏంటో?

ఫోటో కర్టెసి-ట్విట్టర్
సజ్జనార్... ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. ఆయన ఎక్కడ వున్నా ప్రభంజనమే. పోలీసు శాఖలో వున్నప్పుడు నేరగాళ్ల గుండెల్లో నిద్రపోయి బెంబేలెత్తించారు. ఇక ఇప్పుడు తెలంగాణ ఆర్టీసి ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచి ఆర్టీసీలో పలు సంస్కరణలు తీసుకువస్తూ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం తీసుకువస్తున్నారు. కొత్త పోకడలకు పదునుపెట్టి అభివృద్ధి ఎలా సాధించాలో సజ్జనార్ ను చూసి నేర్చుకోవాలంటున్నారు పలువురు అధికారులు.

 
ఇక అసలు విషయానికి వస్తే... సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా వుండే సజ్జనార్ తాజాగా ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో బస్సులో ఓ బాలిక చేయి ఊపుతూ కనబడుతోంది. ఈ ఫోటో ఎక్కడిది అంటూ నెటిజన్లకు ప్రశ్న వేసారు సజ్జనార్. దీనితో నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు స్పందించారు.

 
ఓ నెటిజన్... ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా బాలికల కోసం ఉచిత ఆర్టీసి బస్సు ప్రయాణం ఏమైనా ప్రకటిస్తారా అని అడిగాడు. వెంటనే ఆ ప్రశ్నకు సజ్జనార్ స్పందిస్తూ... త్వరలోనే ఓ పథకాన్ని ప్రకటించనున్నామని తెలిపారు. దీనితో సజ్జనార్ ప్రకటించబోయే ఆ పథకం ఏంటా అన్న చర్చ మొదలైంది. ఎంతైనా సజ్జనార్ సార్... సజ్జనార్ అంతే అంటూ ప్రశంసిస్తున్నారు పలువురు.