శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (10:58 IST)

మహిళలు కుక్కలా?... కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చ!

ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారిపోయాయి. నిన్న నల్గొండ జిల్లాలోని హాలియా లో కెసిఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించారు అనే విషయం తెలిసిందే.
 
ఇక ఈ భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ ప్రముఖులు హాజరు కావడంతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా భారీగా హాజరయ్యారు.
 
ఈ క్రమంలోనే కే సిఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ఇక ఈ సభకు చేరుకున్న మహిళలు కేసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలి అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టారు.

అయితే ఇక మహిళలు అరుస్తున్న సమయంలో ఇక మహిళల వద్ద ఉన్న పేపర్లు తీసుకొని వాళ్లను పంపించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.
 
పేపర్ ఇచ్చి సైలెంట్గా వెళ్ళిపోవాలి అంటూ కేసిఆర్ సూచించినప్పటికీ మహిళలు ఇంకా గట్టిగా అరవడంతో అసహనానికి లోనైనా కేసిఆర్ మీలాంటి వాళ్లను చాలా చూశానని మీలాంటి కుక్కలు ప్రతి చోట ఉంటారని.. ఇలాంటి కుక్కలను పట్టించుకోము అంటూ చెప్పారు.

అంతే కాకుండా వాళ్ళని బయటికి నెట్టేయండి అంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే దీనిపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

హామీలను నెరవేర్చాలని కోరిన మహిళలు మీకు కుక్కల లాగా కనిపించారా కేసీఆర్ అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు నిలదీస్తున్నారు. మహిళలను కుక్కలతో పోల్చిన కేసీఆర్ పై అటు ప్రజలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.