Daily Horoscope
✕

బతుకమ్మ చీరల పంపణీ- జిల్లాలకు చేరుకున్న 11.25 లక్షల చీరలు

Written By సెల్వి
Updated: శనివారం, 2 అక్టోబరు 2021 (12:35 IST)
నేటి నుంచి బతుకమ్మ చీరల పంపణీ ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీకి ఉమ్మడి వరంగల్‌లో రంగం సిద్ధమైంది. సద్దుల బతుకమ్మ పండుగ పూట పేద వర్గాల మహిళలు నిరుత్సాహంగా ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది. సిరిసిల్ల, షాద్‌నగర్, నారాయణపేట, కొత్తపల్లి, తదితర ప్రాంతాల్లో తయారైన చేనేత చీరలను అందజేయడం ద్వారా కార్మికులకు సైతం ఉపాధి కల్పిస్తోంది.
 
ఈ నెల 6 నుంచి బతుకమ్మ సంబరాలు మొదలై 13 వరకు జరగనున్నాయి. దీంతో అధికారులు ముందుగానే స్టాక్‌ తెప్పించి, గోదాముల్లో భద్రపరిచారు. గాంధీ జయంతి సందర్భంగా శనివారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ జిల్లాలోని కమలాపూర్‌ మండలం మినహా, జిల్లా పరిధిలోని మిగతా ప్రాంతాల్లో చీరల పంపిణీకి ఎన్నికల కమిషన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.
 
దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబాల్లోని 18 సంవత్సరాలు పై బడిన యువతులు, మహిళలు చీరలు పొందేందుకు అర్హులు. ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా 12.87 లక్షల ఆహార భద్రత కార్డులు ఉండగా, 13,45,015 మంది అర్హతగల వారిని గుర్తించారు. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఇప్పటి వరకు 11.25 లక్షల చీరలు జిల్లాలకు చేరుకున్నాయి

అన్నీ చూడండి

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments