శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: సోమవారం, 26 జూన్ 2017 (14:00 IST)

బ్యూటీషియన్ శిరీషను ఎస్సై దగ్గరకు అందుకే తీస్కెళ్లారా? శ్రావణ్‌కు పోలీస్ ప్రశ్న

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు ఈ కేసులో నిందితులైన శ్రవణ్, రాజీవ్‌లను చంచల్ గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద కేసుకు సంబంధించి మరింత విచారణ చేయనున్నారు. అసలు అంత రాత్రివేళ బ్యూటిషియన

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు ఈ కేసులో నిందితులైన శ్రవణ్, రాజీవ్‌లను చంచల్ గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద కేసుకు సంబంధించి మరింత విచారణ చేయనున్నారు. అసలు అంత రాత్రివేళ బ్యూటిషియన్ శిరీషను ఎస్సై దగ్గరకు ఎందుకు తీసుకెళ్లారు? 
 
తీసుకెళ్లినవారు అక్కడ మద్యం ఎందుకు సేవించారు? ఏ సెటిల్మెంట్ కోసం శిరీషను అక్కడకు తీసుకువెళ్లాల్సి వచ్చింది? ఎస్సై వద్ద శిరీషను వదిలి బయటకు సిగరెట్ తాగేందుకు ఇద్దరు ఎందుకెళ్లారు? ఎస్సై వద్ద వున్న శిరీష ఎందుకు కేకలు వేయాల్సి వచ్చింది? 
 
పోలీసు స్టేషనులోనే శిరీష వుంటే ఆమె ఫామ్ హౌసును ఎందుకు షేర్ చేసింది? ఇత్యాది ప్రశ్నలకు నిందితులను నుంచి సమాధానాలను రాబట్టే అవకాశం వున్నదని అంటున్నారు. పోలీసుల విచారణతో శిరీష-ఎస్సై ఆత్మహత్యలపై మరింత సమాచారం రావచ్చని భావిస్తున్నారు.