బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (11:50 IST)

సీఎం కేసీఆర్‌కు 21 ప్రశ్నలు.. సమాధానం చెప్పాలి.. బండి ప్రశ్న

bandi sanjay
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్రలో బండి సంజయ్.. పార్టీ 21వ ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ 21 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 21 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్లీనరీ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఈ ప్లీనరీలో సీఎం కేసీఆర్ 21 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అసలు కేసీఆర్ అసమర్థ పాలనపై 1000 ప్రశ్నలు అడిగినా సరిపోవేమో అన్నారు. 
 
ఈ సందర్బంగా బండి సీఎం కేసీఆర్ కు నిజం చెప్పకూడదనే శాపం ఏమన్నా ఉందా? అంటూ ప్రశ్నించారు. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు నిజాలు చెప్పరు అబద్దాలే చెబుతారు. నిజం చెబితే ఏమన్నా అవుతందనే శాపం ఏమన్నా ఉందేమో అంటూ అనుమానం వ్యక్తం చేశారు.  
 
అసెంబ్లీ సాక్షిగా 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి నోటిఫికేషన్ల విషయంలో తాత్సారం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఇంకా 63,425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇంకెప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నిస్తూ బహిరంగ లేఖ రాసిన‌ట్లు బండి సంజ‌య్ చెప్పారు.