గ్రూప్ 1 పోస్టుల భర్తీకి అనుమతులు.. ఆరు పేపర్లు.. 900 మార్కులు
తెలంగాణలో త్వరలో 503 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో.. ఈ ఖాళీల భర్తీకి అనుమతులు ఇస్తూ ఆర్థిక శాఖ జీఓ సైతం విడుదల చేసింది.
గ్రూప్-1లో ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షలను నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌ను ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఈ పేపర్ కరెక్షన్.. ఫలితాల ప్రకటనలో ఎలాంటి సమస్యలు పెద్దగా ఉండవు. కానీ.. మెయిన్స్ వ్యాసరూప ప్రశ్నలు కావడంతో వాటిని ప్రొఫెసర్ల చేత దిద్దించాలని నిర్ణయించారు.
గ్రూప్ 1 మెయిన్స్‌లో ఆరు పేపర్లు 900 మార్కులు ఉంటాయి. ప్రొఫెసర్‌లతో కూడిన బృందం ప్యానల్ అభ్యర్థును ఎంపిక చేస్తారు. ఇద్దరు ప్రొఫెసర్లు పేపర్లు కరెక్ట్ చేసిన తర్వాత సరాసరి మార్కులను అభ్యర్థికి ప్రకటిస్తారు.