ధోనీపై కేటీఆర్ ప్రశంసల జల్లు.. అతనో అసాధారణ ఫినిషర్
ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఇన్నింగ్స్‌పై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. తన ట్విట్టర్ పేజీలో ధోనీని కొనియాడాడు. ధోనీకి వయసు కేవలం సంఖ్య మాత్రమే అని కేటీఆర్ పోస్ట్ చేశారు.
ధోనీ ఓ ఛాంపియన్ క్రికెటర్ అని, అతనో అసాధారణ ఫినిషర్ అని కితాబిచ్చారు. రోజు రోజుకు ఈ లెజెండరీ క్రికెటర్ మరింత పరిణితి చెందుతున్నాడని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ఇకపోతే.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది.
చివరి 4 బంతుల్లో చెన్నై జట్టు 16 పరుగులు చేయాల్సిన స్థితిలో వరల్డ్ బెస్ట్ ఫినిషర్ ధోనీ మరోసారి తనదైన శైలిలో వరుసగా 6, 4, 2, 4 పరుగులతో మ్యాచ్‌ను గెలిపించాడు.
కాగా ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం వరుసగా ఏడో పరాజయాన్ని మూటగట్టుకుంది.