1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Rains in Hyderabad

హైదరాబాదుకు చల్లని కబురు... ఈదురుగాలులతో వర్షాలు

Rains
భానుడు భగ్గుమంటున్న వేళ హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
 
ఏప్రిల్ 20వ తేదీ బుధవారం ఉపరితల ద్రోణి రాయలసీమ నుండి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9కి. మీ ఎత్తు వద్ద కొనసాగుతోంది. 
 
ఈ ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 
తర్వాతి కథనం
మొదటి ప్రముఖమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంగా ''కూ''