శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (15:02 IST)

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైను కలిసిన టీఎస్ బీజేపీ నేతలు

tamizhisai sounderrajan
తెలంగాణ ప్రాంతానికి భారతీయ జనతా పార్టీ నేతలు బుధవారం ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిశారు. ఇటీవల తెరాస నేతల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం జిల్లా రామయ్య పేటకు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్, అతని తల్లి ఆత్మహత్యలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. 
 
ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై గవర్నర్‌ జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. 
 
పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, కేసుల దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు గవర్నర్‌ను అభ్యర్థించారు. ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారని బీజేపీ నేతలు తెలిపారు. కాగా, తెలంగాణాలో అధికార తెరాస, బీజేపీల మధ్య అన్ని విధాలుగా ప్రచ్ఛన్నయుద్ధం సాగుతున్న విషయం తెల్సిందే.