బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (22:26 IST)

హైదరాబాద్‌లో వ్యభిచార గుట్టు రట్టు.. ముగ్గురు అరెస్ట్

romance
హైదరాబాద్, మీర్ పేటలో వ్యభిచార గుట్టు రట్టు అయ్యింది. వ్యభిచారం నిర్విస్తున్న ఇంటిపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వ్యాపారి పిల్లలమర్రి వేణు(33) అమాయక యువతులను లక్ష్యంగా చేసుకొని ఉపాధి పేరిట ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద యువతులు, మహిళలతో వ్యభిచార ఊబిలోకి లాగుతున్నారు. 
 
మీర్ పేట లక్ష్మీనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఈ ఇంటిపై సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. 
 
ఈ దాడిలో నిర్వాహకుడు వేణుతో పాటు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన యువతి(24), వనస్థలిపురం క్రిస్టియన్‌ కాలనీకి చెందిన విటుడు కొల్లా బలరాముడు(52) ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై  దర్యాప్తును కొనసాగిస్తున్నారు.