మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2022 (16:38 IST)

అగ్నికి ఆహుతి అయిన ఎలక్ట్రిక్ స్కూటర్.. వృద్ధుడు మృతి.. ఎక్కడ?

fire
ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు అగ్ని ప్రమాదాలకు గురవుతుండటం కొత్త కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా, తెలంగాణా రాష్ట్రంలో మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో ఓ 80 ఏళ్ల వృద్ధుడు మరణించగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. 
 
ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే, తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో గురువారం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలడంతో 80 ఏళ్ల వృద్ధుడు మరణించాడు.  అతని కుటుంబంలోని మరో నలుగురికి కాలిన గాయాలయ్యాయి. 
 
పోలీసుల ప్రాధమిక సమాచారం ప్రకారం, వారి ఇంటి గదిలో బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. చనిపోయిన వ్యక్తిని బి రామస్వామిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.