గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (07:25 IST)

షర్మిలమ్మా.. అన్నమీద కోపముంటే ఏపీలో చూపించుకో : మంత్రి కేటీఆర్

ktrao
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలకు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటైన విమర్శలు చేశారు. అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై షర్మిలకు కోపం ఉంటే ఆంధ్రాలో చూపించుకోవాలి గానీ తెలంగాణాలో పనేమిటని మంత్రి కేటీఆర్ ప్రశ్నిచారు. 
 
ఆయన తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు షర్మిల ఎవరు, ఆమెకు ఇక్కడేం పని అంటూ ప్రశ్నించారు. అత్తమీద కోసం దుత్తమీద చూపించినట్టుది షర్మిల వ్యవహారం. అన్నమీద కోపం ఉంటే ఏపీలో పార్టీ పెట్టుకోవాలని కానీ తెలంగాణాలో ఏర్పాటు చేస్తే ఏం లాభం అని ఆయన సూటిగా ప్రశ్నించారు. 
 
అస్సలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో షర్మిలకు ఆవగింజంత భాగస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. షర్మల తండ్రి వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్ర బద్ధ విరోధి, వ్యతిరేకి కూడా. ఆయన చనిపోయేంత వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి. కానీ, ఇపుడు షర్మిల ఇక్కడకు వచ్చిన నేను రాజన్నబిడ్డను, తెలంగాణ బిడ్డను, తెలంగాణా కోడలిని అంటూ ఊకదంపుడు ప్రచారం చేసుకుంటే ఎవరైనా నమ్ముతారా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.