సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 13 జులై 2023 (13:42 IST)

చిట్టీ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లి తిరిగిరాని బాలుడు... ఎక్కడ?

missing
హైదరాబాద్ నగరంలో 12 యేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. చిట్టీ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లిన బాలుడు మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు రాత్రంతా గాలించినా ఫలితం కనిపించలేదు. దీంతో బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. 
 
నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర నగర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన కలకలం రేపుతోంది. రాత్రంతా గాలించినప్పటికీ ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో కిడ్నాప్ అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 
 
అదృశ్యమైన బాలుడి పేరు సాయిచరణ్. బుధవారం రాత్రి చిట్టీ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.