గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2023 (16:34 IST)

బకెట్ నిండా నీరు.. పడిపోయిన చిన్నారి.. గమనించకపోవడంతో?

నిజామాబాద్‌ జిల్లాలో ఓ చిన్నారి నీటి బకెట్‌లో పడి ప్రాణాలు కోల్పోయింది. కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఎత్తోండ గ్రామానికి చెందిన కేశవ్, గంగామణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. 
 
సోమవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా.. చిన్న కుమార్తె వేదశ్రీ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బకెట్‌లో పడిపోయింది. 
 
బకెట్ నిండా నీరు ఉండటంతో అందులో మునిగింది. చిన్నారి బకెట్‌లో పడటాన్ని ఆలస్యంగా గమనించిన కుటుబంసభ్యులు.. వెంటనే కోటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 
 
అక్కడ నుంచి పరిస్థితి విషమించడంతో బోధన్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు.